Thursday, January 19, 2012

నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు....!!!రాజకీయ నాయకుల సిగ్గులేని తనం పైన నా మనస్సాక్షికి అనిపించిన విషయాలు..

            మన దౌర్భాగ్యం ఏమోగాని పరిపక్వత కలిగిన  రాజకీయ నాయకులను చుద్దాం అంటే మచ్చుకు కుడా కానరారు. కొన్ని రోజులు వాడు అవినీతి చేసాడని వీడు, వీడు  అక్రమాలు చేసాడని వాడు కొట్టుకుంటారు. మరి కొన్ని రోజులు దమ్ముంటే మా ఊర్లో పోటి చెయ్, మా ప్రాంతంలో అడుగు పెట్టు లాంటి వ్యాఖ్యలతో రెచ్చగొట్టుకుంటారు.ఒకడేమో నాలిక కోస్తా అంటే దానికి కౌంటర్ గా మరొకడు పీక కోస్తా అంటాడు. ఒక ఉద్ధండుడెమో పడగొడతా పడగొడతా అని అరుస్తుంటే దీనికి కౌంటర్ గా మరొకడు నిలబెడతా, తొడగొడతా అంటాడు. ఒకడేమో నేను రైతుల కోసమే రాజకీయాలు చేస్తున్నానంటే మరొకడు రైతు "పచ్చ"గా ఉండటానికి ప్రాణాలయినా అర్పిస్తానని ఊదర గొడతారు. మన రొచ్చు రాజకీయాలలో ఇప్పుడు నేను ప్రస్తావించిన విషయాలు కేవలం మచ్చుకు మాత్రమే.
              అసలు ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే నిన్న అపర చాణక్యుడు, ఉద్యోగుల పాలిటి సింహ స్వప్నం, "బీప్" పోటు వీరుడు గా పేరు గాంచిన మన మాజీ ముఖ్యమంత్రి గారు చేసిన ఒక వ్యాఖ్యని చూసి నాకు వొళ్ళు మండింది. తెలుగు జాతికి వన్నెతెచ్చిన మామగారి విగ్రహాన్ని పార్లమెంట్ లో పెట్టించలేకపోయిన ఆయనగారు మన రాష్ట్రంలో ఉన్న అనుమతి లేని దివంగత ముఖ్యమంత్రి గారి విగ్రహాలను తీయిన్చేస్తాడట. ఏమండీ...!!! అసలు నట సార్వభౌమ రామారావు గారి వర్ధంతి రోజున చేయాల్సిన వ్యాఖ్యలేనా ఇవి. కేంద్రం లో చక్రం తిప్పే బలం ఉన్న నాయకుడు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి. పాడిన పాటే పాడరా పాసి పళ్ళ సుబ్బయ్యా అన్నట్లు ఎన్.టి.ఆర్ వర్ధంతి రోజున కూడా దివంగత ముఖ్య మంత్రి విగ్రహాల మీద పడ్డారు ఆ మహానుభావుడు. ఎందుకంటే  ఈయన గారికి దివంగత ముఖ్య మంత్రిని రోజు ఏదో ఒకటి అననిదే నిద్ర కూడా పట్టదు మరి . అసలు ఎన్.టి.ఆర్ కి భారతరత్న రాక పోవడానికి మరియు ఆయన విగ్రహం పార్లమెంటులో లేక పోవడంలో  ప్రధాన పాత్ర ఈయన గారిదేనని ఆయన తోక పత్రిక మరియు ఆ తోక కి తోక అయిన మరో ఛానలు నిన్న చర్చ కుడా నిర్వహించాయిలెండి. జనాలు ఏమనుకుంటారోనన్న భయం ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయరు.
             ఈ తతంగం కేవలం ఒక రాజకీయ నాయకుడికి మాత్రమే పరిమితం కాదు. అందరూ అందరే...!!! ఒక్క నాయకుడికి కూడా ప్రజా సమస్యల పట్ల అవగాహన లేదు. ఏదయినా సమస్య వచ్చినపుడు ఒక్కడు కూడా నిర్మాణాత్మక సూచనలు ఇవ్వరు. ఎంత సేపూ పొద్దున్న లేచి  అవతలి వాడిని ఎంత బాగా అమ్మ నా బూతులు తిడదామా అని మాత్రమే ఆలోచిస్తారు. విద్యుత్ చార్జీల పెంపు సమస్య కాదా నాయనా...??? అకాల వర్షాలతో పంట కోల్పోయిన రైతుల గురించి మీరు ఏం చేసారు. ప్రభుత్వం వాళ్లకు ఎలాగు తీరదు. ఎందు కంటే ఢిల్లీ వెళ్లి అమ్మగారి పాద సేవ లో తరించాలి...లేకుంటే  అమ్మ గారు ఆవలించలేరు...!!! మన రాష్ట్ర పార్టీలకయినా  సిగ్గుండాలి కదా... నలుగురిని వెనకేసుకుని మమ అనిపించడం తప్ప ఎంతమంది చిత్త శుద్ధి తో పని చేస్తున్నారు చెప్పండి.
           వీళ్ళ తీరు మార్చుకోక పోతే పాత ఇంకుడు గుంతలలో కొంతమందిని, బంగాళాఖాతంలో మరి  కొంతమందిని, ఢిల్లీ యమునానదిలో మిలిన వాళ్ళని పాతి పెట్టడం ఖాయం...!!! 

2 comments:

  1. "పాడిన పాటే పాడరా పాసి పళ్ళ సుబ్బయ్యా" కాదండి.
    "పాడిన పాత పాటలే పాడరా పాచిపళ్ళ దాసరి" అంటారు.
    గ్రామాలకి వచ్చే హరిదాసులు ఎప్పుడూ పాడిన పాత పాటలే పాడుతుంటారు కదా. అందుకే ఆ సామెత వచ్చింది.

    ReplyDelete
  2. రాజకీయ నాయకులు న్యూ చానల్స్ బురదలో పందులు వాటి గురించి ఇంకా ఏమి మాట్లాడుతాం .... ఒక పందికి బురద అంటితే అది పది పందులకు పూసి సంతోషపడుతుంది అంట పెద్దలు చెప్పగా విన్ననాను.. వీళ్ళని పందులతో పోల్చాము అని ఆ పందులకు తెలిస్తే ఎక్కడ ఉరివేసుకొని సచ్చిపోతాయో ఏమో? అవి కూడా ఈ రాజకీయ నాయకులను న్యూస్ చానల్స్ చూసి మనమే అనుకున్నాం మనకన్నా మహాను బావులు ఉన్నారు అని తెగ ఫీల్ అయిపోతున్నాయి.. అంట ...

    ReplyDelete