Friday, January 04, 2013

BSNL....Bad Signal No Lines...మూడు నెలల bsnl "నేస్తం" తో నా అనుభవాలు .... Dont miss it ....

                      BSNL ని కించపరచాలనే ఉద్దేశ్యం కాదు కానీ, వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఆ సంస్థ అధికారులు ప్రవర్తిస్తున్న తీరుకి వొళ్ళు మండి ఈ టపా రాస్తున్నాను.

                     ఆ మధ్య BSNL ల్యాండ్ ఫోన్ ఉన్న వారికి బంధం పేరుతో ఉచిత సిమ్ కార్డు ఇచ్చేవారు. ఆ విధంగా మా ఇంట్లో ఉన్న ల్యాండ్ ఫోన్ పేరు మీద తొలిసారిగా BSNL GSM సిమ్ ని తీసుకున్నాం. మొదట్లో బంధం సిమ్ నుంచి ల్యాండ్ ఫోన్ కి అపరిమిత ఉచిత నిముషాలు మాట్లాడుకునే అవకాశం  ఉండేది. అత్తా కోడళ్ళ మధ్య ఖర్చు లేకుండా మాట్లాడుకునే అవకాశం  రావడంతో ఆ సిమ్ ని మా ఆవిడ తీసుకుని వాడటం మొదలు పెట్టింది. ఇంతవరకు బాగానే ఉంది.ఖర్చుని ఇంకాస్త తగ్గిద్దాం అన్న ఆశతో గత 9 సంవత్సరాలుగా వోడాఫోన్ వాడుతున్న నామీద మా ఆవిడ కన్ను పడింది.ఇంకేముంది, BSNL కి మారిపోయి నేస్తం ప్లాన్ తీసుకోండి...10 పైసలకే మాట్లాడుకోవాచు అని పోరు మొదలు పెట్టింది. సరే అని ఒకానొక దుర్ముహూర్తం లో MOBILE NUMBER PORTABILITY కి దరఖాస్తు చేసుకుని BSNL లోకి మారిపోయా. ముహూర్త బలమో ఏమో కాని, నా కష్టాలు మొదలవడానికి ఎంతో సమయం పట్టలేదు. 
నాకు ఎదురయిన అనుభవాలలో కొన్ని....
  • నేను సన్నద్ధమవుతున్న పరీక్షకు సంబంధించి ఒక కాల్ వచ్చింది. ఒక్కనిముషం మాట్లాడే లోపే కాల్ కట్....!!!!
  • సాయంత్రం 6 దాటినతర్వాత ఫోన్ కలిసిందంటే టీవీ లో మన అభిమాన హీరో లైవ్ ప్రోగ్రాం కి కాల్ కలిసినంత ఆనందం ....!!!
  • కాల్ మధ్యలో హలో...హలో... అని అనకుండా మాట్లాడటం అసంభవం.
                ఇన్ని సమస్యలతో నెల తిరిగే లోపే ఫోన్ చేయాలన్న...అవతలి వారి ఫోన్ ఎత్తాలన్నా చిరాకు మొదలయింది. పోనీ sms లతో నెట్టుకోద్దాం అనుకున్న నాకు అక్కడ కూడా కష్టాలు తప్పలేదు. మా ఫ్రెండ్ కి WHERE ARE YOU ? అని SMS చేసిన పాపానికి వాడు నా మీద అంతెత్తున లేచాడు. తప్పు వాడిది కాదులెండి. వాడి మానాన వాడు patients ని చూసుకుంటున్నాడు . నేను ఒక్క సారి పంపిన where are you ? అన్న సందేశం BSNL వారి మహిమతో వాడికి మూడు సార్లు వెళ్ళింది. అత్యవసరమేమో అని వాడు ఫోన్ చేయడం, ఊరికే అని నేను , ఊరికే  అయితే మూడుసార్లు ఎందుకు మెసేజ్ చేశావా అని వాడు...ఇలా.... మధ్యలో as usual గా కాల్ కట్ అవడంతో బతికిపోయాను అనుకోండి....!!!
            ఇలా రెండు నెలలు భరించిన నేను signal problem మీద complaint  ఇద్దాం అని customer care కి ఫోన్ చేసినా ... స్థానిక BSNL కార్యాలయానికి వెళ్ళినా...online portal లో complaint చేసినా....దున్నపోతు మీద వాన కురిసినట్టు సిగ్నల్ సమస్య మాత్రం తీరలేదు. ఈ లోపు మూడు నెలలు నిండిపోయాయి .(ఒక సారి పోర్ట్ అయిన తరువాత మళ్లీ పోర్ట్ అవ్వాలంటే మూడు నెలలు ఆగాలి అనే నిబంధన ఉంది) మళ్లీ porting request పెట్టుకుని vodafone కి వెళ్ళడంతో BSNL తో నా మూడు నెలల నేస్తం ముగిసింది. అత్తా కోడళ్ళు కూడా రెండు Reliance CDMA (less radiation, superior voice clarity ) ఫోన్లు కొనుక్కుని కబుర్లు కొనసాగిస్తున్నారు ....