Friday, December 30, 2011

మనకు తెలియని ఆసక్తికరమయిన నిజాలు


  1. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం చూపుడు వేలు ఎనిమిది అడుగుల పొడవు ఉంటుంది.  
  2. చిలీ లోని అటకామా లోని కొన్ని  ఎడారి ప్రాంతాలలో  ఇంత వరకు అసలు వర్షపాతం అనేది నమోదవలేదు.
  3. బోయింగ్ 747 విమానం రెక్కల పొడవు , రైట్ సోదరులు కనిపెట్టిన విమానం కంటే పొడవుగా వుంటాయి.
  4. దోమలు మిగతా రంగులకన్నా నీలం రంగు వైపు ఎక్కువ ఆకర్షించ బడతాయి.
  5. అమెరికా వాస్తవ్యులు ఒక రోజు తినే పిజా పరిమాణం దాదాపు 75 ఎకరాలు
  6. 75 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి తన జీవిత కాలం లో 23 సంవత్సరాల పాటు నిద్రపోయి ఉంటాడు.
మరిన్ని ఆసక్తికరమయిన నిజాల కోసం మరొక టపా కోసం ఎదురు చూడండి....!!!

    తుఫాన్ లకు పేర్లు ఎలా పెడతారు...!!!

                 నీరు ప్రశాంతంగానే కనిపిస్తుంది, కానీ అప్పుడప్పుడు జలహృదయం లో ప్రకంపనలు వస్తుంటాయి. నీటికి కోపం వస్తుంది. ఆ కోపమే జలప్రళయం అవుతుంది. ఆ కోపంలో భాగంగానే అప్పుడప్పుడు తుఫాన్లు వస్తుంటాయి. తుఫాన్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తీరప్రాంతాలను అల్లకల్లోలం చేస్తాయి. ప్రస్తుతం మనం చూస్తున్న థేన్ తుఫాన్ కూడా అలాంటిదే. అయితే ఈ తుఫాన్లకు పేర్లు ఎవరు పెడతారు అనే అనుమానం వచ్చి అంతర్జాలంలో వెతకగా చాలా కొత్త విషయాలు తెలిసాయి.
                ఇలా ప్రపంచవ్యాప్తంగా వచ్చే తుఫాన్లను మహాసముద్రాల వారీగా గుర్తించారు. ప్రస్తుతం మనం ఉంటున్నది నార్త్ ఇండియన్ ఓసియన్ జోన్. ఈ జోన్ లో మన దేశంతో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక , థాయిలాండ్ , మయన్మార్, ఒమన్, మాల్దీవులు ఉన్నాయి. ఈ దేశాల్లోని  వాతావరణ శాఖ నిపుణులు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి భేటీ అయి తుఫాన్లకు కొన్ని పేర్లను సూచిస్తారు. అలా ప్రతి దేశం తమ వంతుగా ఎనిమిది పేర్లను సూచిస్తుంది. నార్త్ ఇండియన్ ఓసియన్ జోన్ లో మొత్తం ఎనిమిది దేశాలు ఉన్నాయి కాబట్టి, మొత్తం 64 పేర్లను ముందే నిర్ణయించారు. ఇప్పటికి 27 తుఫాన్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం 28 వ తుఫాన్ ను మనం చూస్తున్నాం.
                 నార్త్ ఇండియన్ ఓసియన్ జోన్ కి సూచించిన పేర్లలో  మన దేశం వారు అగ్ని, ఆకాష్బిజ్లి , జల్, లేహేర్, మేఘ, సాగర్, వాయు అనే పేర్లు సూచించారు. ప్రస్తుతం మన తూర్పు తీరాన్ని అల్ల కల్లోలం చేస్తున్న "థేన్ " తుఫాన్ పేరు మయన్మార్ దేశస్తులు సూచించారు. శ్రీలంక మరియు బంగ్లాదేశ్ వారు సూచించిన పేర్లలో మాల, రష్మి, నిషా, గిరి , అనే పేర్లు మన వాడుక భాషకు చాలా దగ్గరగా ఉన్నాయి. ఇక పక్కనే ఉన్న పాకిస్తాన్ విషయానికి వస్తే నర్గిస్, లైలా, బుల్బుల్ , నీలం, నిలోఫర్  అని మన దేశ హీరోయిన్ల పేర్లు జల ప్రళయాలకు పెట్టి ఆనందిస్తున్నారు( ఎంతయినా మన శత్రువులు కదండీ...!!!) ఇదండీ తుఫాన్ల పేర్ల వెనుక ఉన్న కథా కమామీషు. రాబోయే ముర్జన్, నీలం ( అదేనండి... పేర్లు ముందే పెట్టేసారు కదా, వరుసక్రమం లో ఈ పేర్లు తరువాత వచ్చే తుఫాన్లకు పెడతారు) తుఫాన్లు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా వాటి దారిన అవి తీరం దాటతాయని  ఆశిద్దాం....!!!

    Monday, December 26, 2011

    అంతర్జాతీయ మానవతా సహాయ శిక్షణ సదస్సు విశేషాలు

                   ఈ నెల 12 వ తారీఖు నుంచి 16 వ తారీఖు వరకు ఢిల్లీ లో  అంతర్జాతీయ మానవతా సహాయ శిక్షణ సంస్థ వారు శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. ఈ సంస్థ వారు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఒక దేశం లో శిక్షణా శిబిరాలను నిర్వహిస్తుంటారు. నేను పని చేస్తున్న M S F సంస్థ వారు నాకు ఆ శిక్షణా శిబిరములో పాల్గొనే అవకాసం కలిపించారు. ఆ సందర్భం గా జరిగిన విషయాలను ఈ టపా లో మీతో పంచుకుంటునందుకు నాకు చాల గర్వం గా ఉంది.
                  ఇక విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తం గా  ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చాలా సోదాహరణంగా శిక్షకులు వివరించారు. అంతర్యుధం, పేదరికం, ప్రభుత్వం చే నిర్లక్ష్యం చేయబడిన, ప్రకృతి విపత్తులలో సర్వస్వం కోల్పోయిన ప్రజలు ఎదుర్కొనే కష్టాలు చూసి నా మనసు చలించి పోయింది. ప్రస్తుతం నేను పని చేసే ఆంధ్ర, ఒరిస్సా ఛత్తీస్ ఘడ్ ప్రాంత గిరిజనులకు వైద్య సదుపాయం అందించే ప్రక్రియ కొంచెం కష్టము తో కూడుకున్నది . ఈ శిక్షణ తరువాత ఈ ప్రాంత గిరిజనులకు ఇంకా మెరుగ్గా వైద్య సేవలు అందించ గలననే నమ్మకం కలిగినది.
                    ఇంకా ఈ సదస్సు లో ప్రపంచ వ్యాప్తం గా పనిచేసే స్వశ్చంద సంస్థల గురించి కూడా తెలుసుకున్నాను. అత్యవసర పరిస్థుతుల బారిన పడిన ప్రజలకు , అలాగే శరణార్దులకి వసతి, ఆహరం , వైద్య సేవలు, విద్య, వంటివి ఎలా సమకుర్చాలో ఈ సదస్సు ద్వారా చాలా చక్కగా తెలుసుకున్నాను. అలాగే ఏదయినా ఒక ప్రకృతి విపత్తు సంభవించినపుడు చాలా సంస్థలు అక్కడ సహాయం అందించడానికి వస్తాయి. ఇటువంటి పరిస్థితులలో అన్ని సంస్థలతో పరస్పరం సమాచారం ఇచ్చి చేసే పనిని ఎంత బాగా చేయవచ్చో చక్కగా వివరించారు. 
                   ఎముకలు కొరికే చలిలో  (  2 .6  డిగ్రీల చలి ) శిక్షకులు చెప్పిన తాజా తాజా విషయాలతో వారం రోజులు తెలియకుండా అయిపోయాయి. కానీ చివరకు ఎంతో నేర్చుకున్నాం. అలాగే అవసరములో ఉన్న ప్రజలకు ఇంకా ఎంతో చేయాల్సి ఉందన్న విషయం కూడా తెలుసుకుని నుతనోత్తేజం తో తిరుగు విమానం ఎక్కడం తో నా ఢిల్లీ యాత్ర ముగిసింది.

    Friday, December 09, 2011

    గొప్పలు చెప్పుకుంటే వచ్చే కష్టాలు

    ఈ మధ్య కాలం లో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమా ను నిర్మించిన నిర్మాత ఇంటి మీద ఆదాయపు పన్ను శాఖ వాళ్ళు నిన్న దాడి చేసారు. ఆ తర్వాత ప్రముఖ హీరో గారి ఇంటికి కూడా వెళ్లి ఇల్లంతా సోదాలు చేసినట్లు సమాచారం. దీనంతటికి కారణం వాళ్ళు మా సినిమా అత్యధిక వసూళ్ళు సొంతం చేసుకుంది అని ప్రకటనలు గుప్పించటమే  కారణం. ఏదేమయిన సదరు నిర్మాతలకు తగునా శాస్త్రి జరిగిందని తెలుగు సినిమా అభిమానులు సంబర పడుతున్నారు. ప్రచారం చేసుకోవడం లో తప్పు లేదు కానీ నిజాయితిగా  ఆదాయపు పన్ను చెల్లించి వుంటే వారు ప్రకటించిన వసూళ్ళు అన్ని నిజమని తెలుగు ప్రజలకు నమ్మకం కలిగేది.ఏమంటారు....!!!!