Wednesday, February 01, 2012

మనకు తెలియని ఆసక్తికర నిజాలు-- నాల్గవ భాగం

మరిన్ని ఆసక్తికకర నిజాలతో మరో టపా మీ ముందుకు వచ్చిందండీ....
ఇక ఆలస్యం దేనికి...చదివేయండి...!!!
  1. గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ పుస్తకానికి కూడా ఒక రికార్డు ఉందంట... అదేంటో తెలుసండీ...గ్రంధాలయాలనుంచి అత్యధికంగా, అతి తరచుగా దొంగతనం చేయబడే పుస్తకం ఇదేనటండోయ్...!!!
  2. తేలు మీద కొంచెం అల్కాహాలు వేస్తే , వెంటనే పిచ్చెక్కి దాని కొండె తో అదే కరుచుకుని చనిపోతుందట...!!! ఈ సారి తేలు కనిపిస్తే కర్రతో కొట్టకుండా కొంచెం ఆల్కహాల్ తో కొడతారు కదూ...!!!
  3. వ్యోమగాములు అంతరిక్షం లోనికి వెళ్లేముందు బీన్స్ తినడం నిషేధం అట....ఎందుకంటారా... స్పేస్ సూట్ లో గ్యాస్ వదిలితే అది పాడవుతుందట...!!! 
  4. చాక్లెట్లు కుక్కల నాడీ వ్యవస్థమీద మరియు హృదయం మీద ప్రభావం చూపిస్తాయట. ఒక చిన్న సైజు కుక్కని చంపడానికి కేవలం కొన్ని ఔన్సుల చాకొలేట్ సరిపోతుంది.
  5. మన జీర్ణాశయం లో ప్రతి రెండు వారాలకొక సారి కొత్త మ్యూకస్ పొర తయారవుతుంది.ఎందుకంటే ఆహారం జీర్ణం అయే ప్రక్రియలో మ్యూకస్ పొర పాడవుతుంది.
  6. అగ్గిపుల్ల కంటే సిగరెట్ లైటర్ ని ముందు కనిపెట్టారట...!!!
  7. ఆవుని మెట్లు  ఎక్కించవచ్చు కానీ మెట్ల మీదుగా కిందకి దింపడం అసాధ్యమట...!!!
  8. తెలివయిన వ్యక్తుల వెంట్రుకలలో జింక్ మరియు కాపర్ పాళ్ళు అధికంగా ఉంటాయట...!!!
  9. చిమ్మటలు/ పట్టు పురుగులు భూకంపం వచ్చినపుడు పైకి ఎగరలేవట...!!!
  10. అంటార్కిటికా లో ఇప్పటివరకు నమోదయిన అత్యధిక ఉష్ట్నోగ్రత 3 డిగ్రీల ఫారెన్ హీట్ మాత్రమేనట...!!!  
మరికొన్ని ఆసక్తికర నిజాలతో మరో టపాలో కలుద్దాం....!!!

5 comments:

  1. >> చాక్లెట్లు కుక్కల నాడీ వ్యవస్థమీద మరియు హృదయం మీద ప్రభావం చూపిస్తాయట. ఒక చిన్న సైజు కుక్కని చంపడానికి కేవలం కొన్ని ఔన్సుల చాకొలేట్ సరిపోతుంది. ఇది ఎంత వరకు నిజమంటారు? ఎందుకంటే నా స్నేహితురాలికి మూడు పెంపుడు కుక్కలున్నాయి అవి రోజుకి రెండు cadbury పెద్ద పెద్ద చాక్లెట్లు తింటాయి అయినా ఆరోగ్యంగానే ఉన్నాయి దాదాపు 5 సంవత్సరాల నుండీ! నేను మీరు చెప్పిన ఇదే విషయాన్ని కుక్కలకి కాకుండా రామ చిలుకలకి చదివాను. అవి cadbury తింటే చనిపోతాయని! మరి ఏది ఎంతవరకు నిజమో మీరే చెప్పాలి!
    >> ఆవుని మెట్లు ఎక్కించవచ్చు కానీ మెట్ల మీదుగా కిందకి దింపడం అసాధ్యమట...!!! మరి గృహప్రవేశ సమయములో రెండూ (ఎక్కి దిగుతుంది) చేయిస్తారు కదా???మనం చూస్తాం కూడా!

    ReplyDelete
  2. రసజ్ఞ గారూ...!!! చాకోలెట్స్ లో ఉండే THEOBROMINE కెమికల్ ఈ సమస్యకు కారణం. Theobromine మన నిత్య జీవితం లో వాడే Caffeine కి దగ్గరగా ఉంటుంది. 100-150 mg / kg body weight కుక్కలకు ప్రమాదకరమయిన డోసు. మీ స్నేహితురాలి కుక్కలు ఇంత డోసులో తింటున్నాయా,ఆ చాక్లెట్స్ లో theobromine ఉందా అనే విషయాలను కూడా పరిగణన లోనికి తీసుకోవాలి.....!!! ఇక ఆవు విషయానికి వస్తే మనం గృహ ప్రవేశం చేసేటపుడు అవి ఎక్కి దిగే మెట్లు రెండు లేదా మూడు. కాబట్టి అవి సులభంగా దాటొచ్చు. కానీ మన డాబా మీదకు ఎక్కించి దింపడం అసాధ్యం అని నా అభిప్రాయం... !!!

    ReplyDelete
  3. kotta vishayalu chepparu..thanks..

    ReplyDelete
  4. వెంకట సుబ్బా రెడ్డి గారు ఆవు మెట్లు ఎక్కుతుంది దిగుతుంది కూడాను ..ఎందుకు అంటే గృహప్రవేసలకి ఆవులని 5 అంతస్తు కి కూడా మెట్ల మిద ఎక్కించటం నేను చూసాను ....

    ReplyDelete
  5. నాకు కుడా తెలియదండి సాయి కృష్ణ గారు...మీరు చుశారంటున్నారు కనుక నేను ఒప్పుకుంటాను.... ధన్యవాదములు ...

    ReplyDelete