Thursday, February 23, 2012

మూడు కొత్త ఛుక్ ఛుక్ బండ్లు వస్తున్నాయి, మీ ఊరికి వస్తుందో లేదో తెలుసుకోవడానికి ఇక్కడ చూడండి...!!!

                  
                              మన ఎంపి ల వత్తిడి ఫలితమో లేక మన అదృష్టమో తెలియదు గాని వచ్చే వారం మన రాష్ట్రానికి మూడు  కొత్త రైళ్ళు రాబోతున్నాయి. ఎప్పుడు బీహార్, పశ్చిమ బెంగాల్ వైపు పరిగెత్తే రైళ్ళు ఈ సారి మన వైపు రావడం తెలుగు ప్రజలకు ఆనందం కలిగించే విషయమే...!!! ఇంకెందుకు ఆలస్యం, ఆ రైళ్ళ వివరాలు చుసేయండి.
1) హౌరా -మైసూరు -హౌరా వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ :
                            ఈ ట్రైన్ (నెంబర్ : 22817 ,22818 ) 24 ఫిబ్రవరి 2012 నుంచి మొదలవుతుంది. మన రాష్ట్రం లో పలాస, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి , ఏలూరు,విజయవాడ ,రేణిగుంట , మార్గం గుండా వెళ్తుంది. 
2) షాలిమార్- సికిందరాబాద్- షాలిమార్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్:
                          ఈ రైలు( నెంబర్ :22849 ,22850 ) కూడా 24 ఫిబ్రవరి 2012 నుంచి మొదలవుతుంది. సికిందరాబాద్ నుంచి ఈ రైలు ప్రతి ఆదివారం ఉదయం 5 .30 కి బయలుదేరుతుంది. మనరాష్ట్రంలో  ఖాజీపేట, వరంగల్, విజయవాడ, ఏలూరు , రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం,పలాస , సోంపేట స్టేషన్ లలో ఆగుతుంది.
౩) మంగుళూరు  - సంత్రగాచి  - మంగుళూరు వీక్లీ ఎక్స్ ప్రెస్ :
                          ఈ రైలు (నెంబర్ : 22851 ,22852 ) ఫిబ్రవరి 25వతేదీ నుంచి మొదలవుతుంది. మనరాష్ట్రం లో ఈ రైలు సోంపేట, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, విశాఖపట్నం, సామర్లకోట, రాజమండ్రి ,ఏలూరు, విజయవాడ, ఒంగోలు,నెల్లూరు, గూడూర్, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు స్టేషన్లలో ఆగుతుంది. మన రాష్ట్రంగుండా  ఈ రైలు ఆదివారం మరియు  సోమవారం లలో వెళుతుంది.
                          అయితే ఈ రైళ్ళు అన్ని కోస్తా ప్రాంతం నుంచే ప్రయాణించడం గమనార్హం. రాష్ట్రం లో మిగిలిన ప్రాంతాలను కలుపుతూ మరిన్ని రైళ్ళు తీసుకురావడానికి మన ఎంపి లు కృషి చేస్తారని ఆశిద్దాం.
                         





7 comments:

  1. కాట్పాడి తమిళనాడులో ఉంది, మన రాష్ట్రంలో లేదు.

    ReplyDelete
  2. ధన్యవాదములు ప్రవీణ్ గారూ...సరి చేస్తాను !!! చాల రోజులయినట్లుంది మీరు నా బ్లాగు ముఖం చూసి...!!!

    ReplyDelete
  3. route kosta lo unna, aa route lo ekkuva orisssa/bengal nunchi vastuntaru.

    ReplyDelete
  4. mana rastram lo unna network ni vadukoni vere rastrala vallu labdhi pondutunnaru.
    mana state loni pattanala madhya vipraitaaina raddi undi. vati madhya kotta raillu tiskuralekapotunnaru mana daddamma rajakiyanayakulu.

    ReplyDelete
  5. బెంగాల్ నుంచి ఉత్తరాంధ్ర వరకు మాత్రమే నడిచే బండ్లు:
    షాలిమార్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్: పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరంలలో ఆగుతుంది.
    డిఘా-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్: పలాస, విజయనగరంలలో ఆగుతుంది.

    ReplyDelete
  6. mari maku ante rayalaseema ku emi ivvara...????

    ReplyDelete
  7. అన్ని రైళ్ళూ కోస్తాంధ్రోళ్ళు కోసేసిండ్రు.

    ReplyDelete