నిన్న సరదాగా రైల్వే వెబ్ సైట్ కెలుకుతుంటే ఒక ఆసక్తి కరమయిన విషయం తెలుసు కున్నాను. ఈ విషయం మన బ్లాగర్లలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కాని నాకు మాత్రం కొత్తగా అనిపించి తెలియని వారికి ఈ విషయం చెబుదామని ఈ టపా రాస్తున్నాను
మన భారత రైల్వేశాఖ వారు గత నవంబర్ 21 , 2011 వ తేదిన ఒక కొత్త రైలుని ప్రవేశ పెట్టారు. సాధరణంగా ఏవయినా కొత్త పథకాలు, ప్రదేశాలకు ఆయా రాజకీయ నాయకుల పేర్లు పెట్టే మన ప్రభుత్వం ఈ రైలుకి “వివేక్ ఎక్స్ ప్రెస్” అని స్వామి వివేకానంద పేరు పెట్టడం నాకు ఆనందాన్ని కలిగించింది.
అన్నట్లు ఈ రైలు అస్సాంలోని డిబ్రుగర్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి మధ్య ప్రయాణిస్తుంది. ఈ రైలు అస్సాం, నాగాలాండ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల గుండా 4286 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది
ప్రతి శనివారం మద్యాహ్నం రెండు గంటలకు కన్యాకుమారిలో బయలుదేరే ఈ రైలు బుధవారం తెల్లవారుఝామున 3 .30 కి డిబ్రుగర్ చేరుకుంటుంది. (డిబ్రుగర్ నుంచి మొదలయ్యే రైలు వేళలు పటం లో చూపబడ్డాయి.)అన్నట్లు ఈ రైలు ప్రయాణం కూడా చవకేనండోయ్. కన్యాకుమారి నుంచి డిబ్రు గర్ కు కేవలం 673 రూపాయలతో ప్రయాణం చేయవచ్చు. ఈ రైలు ప్రవేశ పెట్టడంతో ఎక్కడో దూరంగా విసిరేసినట్లు ఉండే ఈశాన్య భారతానికి మిగిలిన భారత దేశంతో సంబంధాలు మరింత మెరుగు పడతాయని నిపుణులు భావిస్తున్నారు.
రెండు వారాలు ఉద్యోగానికి శెలవు పెట్టి ఈ రైలు ఎక్కితే భారత దేశాన్ని ఈ మూల నుంచి ఆ మూలకు ఎంచక్కా చుట్టి రావచ్చు కదండీ....!!! ఏమంటారు....!!!
మన భారత రైల్వేశాఖ వారు గత నవంబర్ 21 , 2011 వ తేదిన ఒక కొత్త రైలుని ప్రవేశ పెట్టారు. సాధరణంగా ఏవయినా కొత్త పథకాలు, ప్రదేశాలకు ఆయా రాజకీయ నాయకుల పేర్లు పెట్టే మన ప్రభుత్వం ఈ రైలుకి “వివేక్ ఎక్స్ ప్రెస్” అని స్వామి వివేకానంద పేరు పెట్టడం నాకు ఆనందాన్ని కలిగించింది.
Vivek Express stops at Srikakulam Road (Amudalavalasa) station that is nearest to me.
ReplyDeleteBut it doesn't stop at Visakhapatnam and it stops at Duvvada. It runs via Simhachalam bye-pass.
ReplyDeleteStops of Vivek Express in our state are:
ReplyDeletePalasa
Srikakulam Road
Vizianagaram
Duvvada
Samalkot
Rajamundry
Eluru
Vijayawada
Ongole
Nellore
It doesn't stop at Tenali and Renigunta.
మన ఆంధ్ర ప్రదేశ్ ప్రజానికానికి చాలా తక్కువ సీట్లు కేటాయించారండి ఈ రైలు లో...!!!
ReplyDeleteNijamenandoy! nenu kooda idi begin chesina modatlo mee laage selava pettesi veladamanukunnanadi! twaralo meru nenu kalasi prayaniddam enchakka!!
ReplyDeletePrior to introduction of this train, longest journey train in India was Himsagar express (From Jammu Tawi to Kanyakumari) and the second longest journey train was Guwahati-Trivandrum express.
ReplyDeleteIn British India, longest journey train was Peshawar-Mangalore Grand Trunk express. It was introduced after completion of Ballalpur-Kazipet railway.
ReplyDeleteBallalpur was the old name of Balharshah in Maharashtra.
ReplyDeleteమీరు పెట్టిన మొదటి ఫొటో వివేకానందుని విశేషాల గురించిన స్పెషల్ ట్రైనుది.
ReplyDeleteఒకసారి చెన్నై స్టేషనులో నిలిచిఉండగా చూసాను.
ఇక మూడవ ఫొటోలోని రైళ్ళ సమయాలు చూస్తే మన రైళ్ళలాగే చాలావరకూ నెమ్మదిగానే వెళుతున్నట్టున్నాయి.
ఐతే ఈ జూలై, ఆగష్టుల్లో పెట్టుకో :-)
ReplyDeleteఏమైతేనేం, ఆ దూర ప్రయాణ ట్రైన్ మా ఆముదాలవలస స్టేషన్‌లో ఆగుతుంది. అదే కదా నాకు కావాలి.
ReplyDeleteబోనగిరి గారు...!!! మీరు చెప్పిన దానితో నేను ఎకీభావిస్తున్నానండి... ఆ రైలు మీద వివేక్ ఎక్స్ ప్రెస్ అని ఉండటంతో పొరపడ్డాను.
ReplyDeleteప్రవీణ్ శర్మ గారికి ఈ టపా తెగ నచ్చినట్లుంది. వ్యాఖ్యలు బాగా చేసారు...!!!
ReplyDeleteభా.రా.రే గారు... మీరు భారత దేశానికి వచ్చినపుడు కలిసి ప్లాన్ చేసుకుందామండి ...!!!
ReplyDeleteఆ హా,
ReplyDeleteమీరు మా ఆస్సాముని గుర్తు చేసారు. వెంటనే ఒక టపా ఈ రైలు ప్రయాణం మీద రాయాల్సిందే నేను!
ఆల్రెడీ కోచిన్-తిన్సుకియా, త్రివేండ్రం దిబ్రుగర్హ్ లాంటివి ఉన్నాయే !
ఇక ఎనభై రెండు గంటలు ఓ అందాజా అంతే ! ట్రైను ఎప్పుడు చేరునో అప్పుడే దాని రాక తెలియును దిబ్రుగర్హ్ కి !
జిలేబీ వెంటనే ఆస్సాము ప్రయాణం పై ఓ టపా రాసేయ్!
చీర్స్
జిలేబి.
ఈ ట్రైన్ మొదలవ్వడానికి ముందే ECoR టైమ్ టేబుల్ PDF డౌన్‌లోడ్ చేసి షెడ్యూల్స్ చూశాను. శ్రీకాకుళం రోడ్ (ఆముదాలవలస)లో ఆగుతుందని తెలుసు కానీ ఇది దేశంలో అత్యంత దూరం ప్రయాణించే ట్రైన్ అని నాకు అప్పట్లో తెలియదు.
ReplyDeleteఈ ట్రైన్ సింహాచలం బైపాస్ లైన్ మీదుగా వెళ్తుంది. దీని వల్ల ఈ ట్రైన్‌కి విశాఖపట్నంలో ఇంజిన్ మార్చాల్సిన అవసరం రాదు. కన్యాకుమారి నుంచి పశ్చిమ బెంగాల్‌లోని పాకూర్ వరకు విద్యుతీకృత లైన్ ఉంది కాబట్టి ఈ ట్రైన్‌ని కన్యాకుమారి నుంచి బెంగాల్ వరకు ఒకే విద్యుత్ ఇంజిన్‌తో నడపొచ్చు.
ReplyDeleteoka appudu HIMASAGAR EXPRESS UNDEDI 1st place lo
ReplyDeleteRead this: In British India, longest journey train was Peshawar-Mangalore Grand Trunk express. It was introduced after completion of Ballalpur-Kazipet railway.
Delete