Wednesday, January 04, 2012

మనకు తెలియని ఆసక్తికరమయిన నిజాలు -- రెండవభాగం

  1. మీరు క్యారెట్లు ఎక్కువగా తింటే గనుక మీ శరీరం ఆరెంజ్ రంగులోకి మారే అవకాశం ఉంది.
  2. ఆక్టోపస్ కి మూడు గుండెలు ఉంటాయి...!!!
  3. మన శరీరంలో 20 నుంచి 30 లక్షల స్వేద గ్రంధులు ఉంటాయి.
  4. బ్లూ వేల్ ( నీటి తిమింగలం ) నాలుక బరువు ఏనుగు బరువు కంటే ఎక్కువ ఉంటుంది.
  5. టైగర్ షార్క్ యొక్క పిండాలు తల్లి గర్భంలో ఒక దానితో ఒకటి కొట్టుకుంటాయి. ఏ పిండం అయితే గెలుస్తుందో అది మాత్రమే గర్భంలో పెరుగుతుంది.
  6. మనిషి కాకుండా వేలు ముద్రలు కలిగి ఉండే మరొక జంతువు  కోలాస్ ( koalas ) మాత్రమే
  7. మాజీ అమెరికా అద్యక్షుడు బిల్ క్లింటన్ తన 8 సంవత్సరాల పదవీకాలంలో కేవలం 2 సార్లు మాత్రమే ఈ-మెయిల్ పంపాడు.
  8. ప్రపంచంలోని అతి పెద్ద మాంటేస్సోరి స్కూల్ మన భారతదేశం లోనే ఉంది. 2002 వ సంవత్సరంలో ఈ స్కూల్లో 26312 మంది పిల్లలు ఉండేవారు.
  9. అన్నిటికంటే పెద్ద మెదడు ఉన్న జంతువు స్పెర్మ్ వేల్ ( sperm  whale ).దాని మెదడు బరువు 9 .07  కి.గ్రా ఉంటుంది.
  10. సాధారణం గా మనిషి కనురెప్పలు నిమిషానికి 15 సార్లు కొట్టుకుంటాయి. కానీ ఈ విషయం చదివిన తరువాత కనురెప్పలు కొట్టుకునే వేగం పెరుగుతుంది....!!!!

23 comments:

  1. తరువాయి భాగం వస్తుందా? లేక స్వస్తి చెప్పారా? తరువాయి భాగం లేకపోతే కనుక ఇక్కడ మరికొన్ని విషయాలను ప్రస్తావించుదామని అడిగా!

    ReplyDelete
  2. మరొక భాగం కోసం ప్రయత్నిస్తాను రసజ్ఞ గారు... మీరు ప్రస్తావించ దలచుకున్న విషయాలను ప్రస్తావించండి.

    ReplyDelete
  3. కంటికి సంబంధించిన సర్జరీలలో షార్కు కోర్నియాని (cornea) వాడతారు ఎందుకంటే అది మాత్రమే మానవుని కోర్నియాకి దగ్గరగా ఉంటుంది. అలానే మన శరీరం మొత్తం మీద రక్త సరఫరా లేని ఏకైక ప్రదేశం కోర్నియా. ఇది ఆక్సిజనుని వాతావరణం నుండే తీసుకుంటుంది. మీరు షార్క్ గురించి ప్రస్తావించారు కనుక వేటిని కూడా చేరిస్తే బాగుంటుంది అనిపించింది. అందుకే అడిగాను.
    తుమ్మిన ప్రతీ సారీ మన బ్రెయిన్లోని కణాలు కొన్ని మరణిస్తాయి.
    మనిషి శరీరం కండరాలకి అంటుకుంటే సొట్టలు(dimples) ఏర్పడతాయి.
    పుట్టినప్పుడు ప్రతీ మనిషికీ వర్ణ అంధత్వం(color blindness)ఉంటుంది.
    నాకీ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు డాక్టరు గారూ!

    ReplyDelete
  4. చాలా మంచి విషయాలు ప్రస్తావించారు రసజ్ఞ గారు...ధన్యవాదములు

    ReplyDelete
  5. Babies are NOT colorblind at birth. However, they often have difficulty differentiating between similar tones. This is why a lot of babies like to look at black and white patterns and other things that have a high contrast between colors. By the time a baby is four months old, it has already consciously chosen its favorite color!

    ReplyDelete
  6. పూర్వం 'నమ్ము నమ్మకపో - రిప్లీ' అనేది వచ్చేది పత్రికలలో.
    దానిని గుర్తు తెస్తున్నారు.

    ReplyDelete
  7. "మనిషి శరీరం కండరాలకి అంటుకుంటే సొట్టలు(dimples) ఏర్పడతాయి"
    అని రసజ్ఞ గారు రాసారు, అది సరి అయినదేనా ? నాకెందుకో కాదేమో అనిపిస్తుందండీ డాక్టర్ గారు!
    I remembered my Anatomy class, it's due to a deformity in the Buccinator muscle!

    ఎలాగూ సొట్టల గురించి ప్రస్తావించారు కాబట్టి , నేను కూడా ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియపరచదలచాను! అదేమంటే
    there are approximately 336 dimples on a golf ball!!

    ReplyDelete
  8. "బ్లూ వేల్ ( నీటి తిమింగలం ) నాలుక బరువు ఏనుగు బరువు కంటే ఎక్కువ ఉంటుంది."
    అని మీరు రాసారు కదా?
    నిజామా సర్? నేను నమ్మను!!!!!!

    ReplyDelete
  9. Most of the mammals are color blind. Only old world monkeys, apes, human beings and some of the new world monkeys can recognize colors. Most of the birds, fish, reptiles and amphibians are tetra-chromatic. They can also recognize ultraviolet rays.

    ReplyDelete
  10. అంటే డింపుల్ కపాడియా, ప్రీతి జింతాలకు Buccinator muscle myloma అనే కండరాల వ్యాధి వుంటుంది.

    ReplyDelete
  11. గుఱ్ఱం తల కంటే గాడిద తల పెద్దదిగా ఉంటుంది. గాడిద పిరుదులు & కాళ్ళు లావుగా ఉంటాయి. అందుకే గాడిద ఎక్కువ బరువులు మోస్తుంది.

    ReplyDelete
  12. గుర్రాన్ని ఒగ్గేసి మీరు గాడిద మీద వూరేగాలి, మీ వాగుడు భరించేది బూపెపంచికంలో అదొక్కటే.

    ReplyDelete
  13. Anon, hahaha
    by the way Subbu, what is the authenticity of those statements? How far can we believe? After reading this post, I bougt two full bags of caratte :)
    For me it seems you just copied the content from elsewhare without knowing the details or Ifs and buts.

    @praveen, wah Kya bath hai. What abt your head and butt?

    ReplyDelete
  14. నేను గోధుమ రంగులో ఉంటాను. నేను ఆరెంజ్ కలర్‌లోకి మారిపోవాలంటే కారెట్లు తినాలా? గోరింటాకు పూసుకుని ఆరెంజ్ కలర్‌లోకి మారడం అంత కంటే సులభం కదా.

    ReplyDelete
  15. ఓ పెవేణా గోరితాంకు పెట్టుకు ఆరెంజ్ వద్దులే గానీ , జర మసి పూసుకు మారేడు కాయ అవ్వు . మామూలు గా జనాలకి టోకరా ఇయ్యడం నే వల్ల కావటం లేదు ఇదన్నా చెయ్యి .

    ReplyDelete
  16. భా.రా.రె గారు ,చాలా వరకు సమాచారం అంతర్జాలం నుంచి సేకరించినదే. శ్యామలీయం మాస్టారు గారు చెప్పినట్టు ఇంతకు ముందు AXN ఛానల్ లో రిప్లీ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అని ఒక ప్రోగ్రాం వచ్చేది. వారు ఈ విషయాలు అన్నీ చెప్పారు. అవి అన్నీ ఒకటికి రెండు సార్లు సరి చూసుకున్నానండి. అన్నీ శాస్త్రీయం గా రుజువు చేసారు.ఒక్క బిల్ క్లింటన్ విషయం లోనే నాకు క్లారిటీ లేదు, ఈ మెయిల్స్ ఏమి పంపకుండా ప్రేమ పురాణాలు నడపడం ఈ కాలం లో కష్టం కదా...!!!

    ReplyDelete
  17. ఎక్కువగా తింటే ఏదీ అరగదు. క్యారెట్లు ఎక్కువ తిని ఆరెంజ్ కలర్‌లోకి మారడమైనా అది కష్టమైన పని. అయినా చాలా రకాల కూరలు ఉండగా కేవలం క్యారెట్లు ఎవరు తింటారు?

    ReplyDelete
  18. డాక్టరు గారు,

    బిల్లు క్లింటన్ గారు పంపించిన ఆ రెండు మెయి ల్లు కూడా బౌన్స్ అయి పోయే యని ఎక్కడో చదివ్నట్టు గుర్తు!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  19. వెబ్ బేస్డ్ మెయిల్స్ ఎప్పుడొచ్చాయో నాకు తెలియదు కానీ 1995లో ఎక్కువ మంది క్లైంట్ సాఫ్ట్‌వేర్స్ ద్వారా మెయిల్స్ పంపేవాళ్ళని మాత్రం చెప్పగలను. నేను 1999 నుంచి టెక్నాలజీ ఫీల్డ్‌లోనే ఉన్నాను. అప్పట్లో కూడా వెబ్ బేస్డ్ మెయిల్స్ వాడేవాళ్ళు తక్కువ. నేను వెబ్ బేస్డ్ మెయిల్ అకౌంట్ ఉపయోగించడం మొదలుపెట్టింది 2003లో. ఇంతకీ క్లింటన్ వెబ్ బేస్డ్ మెయిల్ పంపాడా, లేదా క్లైంట్ సాఫ్ట్‌వేర్ ద్వారా మెయిల్ పంపాడా?

    ReplyDelete
  20. క్లైంట్ సాఫ్ట్‌వేర్ ద్వారా పంపే మెయిల్స్ స్లో ఇంటర్నెట్ కనెక్షన్‌లో కూడా వెళ్తాయి. అందుకే అప్పట్లో అవే మాకు కన్వీనియంట్‌గా ఉండేవి.

    ReplyDelete
  21. జిలేబి గారు...బిల్ క్లింటన్ మెయిల్స్ మీద క్లారిటీ ఇచ్చినందుకు ధన్యవాదములండి.అన్నట్లు మీ పేరు చాల వెరైటీ గా ఉందండి...!!!

    తెలుగు వెబ్ మీడియా గారు.... బిల్ క్లింటన్ వెబ్ బేస్డ్ మెయిల్ పంపాడా, లేదా క్లైంట్ సాఫ్ట్‌వేర్ ద్వారా మెయిల్ పంపాడా అనే విషయం నాకు తెలియదండి. నాకు సాఫ్ట్ వేర్ ఫీల్డ్ తో పరిచయం లేదు

    ReplyDelete
  22. ఈ-మెయిల్ అడ్రెస్ కరెక్టైతే బౌన్స్ అవ్వడం జరగదు. క్లైంట్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించినప్పుడు ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయితే మెసేజ్ outboxలో ఉండిపోతుంది కానీ బౌన్స్ అవ్వడం జరగదు. క్లింటన్ ఏ అడ్రెస్‌లకి మెయిల్స్ పంపాడు?

    ReplyDelete
  23. నా ఈ-మెయిల్ అడ్రెస్ praveensarma@teluguwebmedia.in కూడా వెబ్‌లో ఓపెన్ అవ్వదు. విండోస్‌లోని మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్ లేదా లినక్స్‌లోని Kmail క్లైంట్‌లో ఓపెన్ అవుతుంది. అలాగే బ్యాంక్‌ల ఈ-మెయిల్స్ కూడా క్లైంట్ సాఫ్ట్‌వేర్‌లలో మాత్రమే ఓపెన్ అవుతాయి, వెబ్‌లో ఓపెన్ అవ్వవు.

    ReplyDelete