Wednesday, January 18, 2012

మనకు తెలియని ఆసక్తికర నిజాలు....!!! -- మూడవ భాగం

            ఇక్కడ రాసిన ఆసక్తికర నిజాలన్నీ మన తెలుగు బ్లాగరుల కోసం అంతర్జాలం నుంచి, టి.వి షోల నుంచి సేకరించినవే. శాస్త్రీయంగా ఋజువు కాబడిన అంశాలనే ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. 
  1. ప్రపంచంలో అన్ని ఖండాల పేర్లు  ఏ ఆంగ్ల  అక్షరంతో అయితే మొదలవుతాయో  అదే ఆంగ్ల  అక్షరంతో ముగుస్తాయి ( అమెరికా ఖండాన్ని భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఉత్తర , దక్షిణ భాగాలుగా పిలుచుకుంటారు) ...!!!
  2. మన శరీరంలో అత్యంత బలమయిన కండరం నాలుక....!!!
  3. పందులు తల పైకి ఎత్తి ఆకాశంలోకి చూడటం అనేది భౌతికంగా అసాధ్యం అయిన పని.
  4. కీబోర్డ్ లో ఒక వరుసలో ఉండే అక్షరాలను ఉపయోగించి వ్రాయగలిగిన అతి పొడవయిన పదం TYPEWRITER ....!!!
  5. మీ మోచేతిని మీరు కొరుక్కోవడం అనేది అసాధ్యమయిన పని...!!!!
  6. ధృవపు ఎలుగుబంట్లు అన్నీ ఎడమ చేతి వాటం కలిగి ఉంటాయట...!!!
  7. 111,111,111 x 111,111,111 = 12,345,678,987,654,321 ....!!!!
  8. మీరు ఏదయినా పార్కు లో రెండు కాళ్ళు పైకి ఎత్తిన గుర్రం మీద మనిషి విగ్రహాన్ని చూస్తే ఆ వ్యక్తి యుద్ధం లో చనిపోయినట్లు లెక్కట...!!!
  9. మీ అంతట మీరు శ్వాస ఆపుకుని ఆత్మహత్య చేసుకోవడం అనేది అసంభవం...!!! దయ చేసి ప్రయత్నించకండి...!!!
  10. పెంగ్విన్లకు ఉప్పు నీటిని మంచి నీటిగా మార్చగలిగే శక్తి ఉందట...!!!
  11. మన సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలలో సవ్య దిశలో( CLOCK  WISE )తిరిగే గ్రహం వీనస్ మాత్రమే...!!! 
  12. ఈ విషయాలన్నీ చదివిన వాళ్ళలో 90 శాతం మంది వారి మోచేతిని కోరుక్కోవడానికి ప్రయత్నిస్తారట....!!!!
 మరి కొన్ని ఆసక్తికర అంశాల కోసం మరొక టపా కోసం ఎదురు చూడండి...!!!

3 comments:

  1. >>>>>
    మీ అంతట మీరు శ్వాస ఆపుకుని ఆత్మహత్య చేసుకోవడం అనేది అసంభవం...!!!
    >>>>>
    ఇది చదివినవాడు దిండుతో తన ముఖం తానే నొక్కుకోవడం లాంటి పనులు చేసి శ్వాస ఆపుకోవడానికి ప్రయత్నించడని గ్యారంటీ ఏమిటి? కనుక ఇలాంటి సలహాలు ఆత్మహత్యలని ప్రోత్సహించేటట్టే ఉంటాయి.

    ReplyDelete
  2. ప్రవీణ్ శర్మ. మీ అభ్యంతరం కొంతవరకు సహేతుకమైనదే. కాని పూర్తిగా కాదేమో!

    సినిమాలలోకూడా అప్పుడప్పుడు ఆత్మహత్యా ప్రయత్నాలు చూపుతారు. నాక్కూడా అలాంటివి సూచనగా తప్ప దృశ్యమానం చేయరాదని గట్టిగా నిరసన ప్రకటించాలనిపిస్తుంది. బహుశః మీకు తెలసుననుకుంటాను. భారతీయ నాటక రచనా పధ్ధతిలో చావు, శృంగారం, (భోజనం కూడా!) వంటివాటిని దృశ్యమానంగా చూపరాదని నియమం ఉంది.

    మీరయితే యేకంగా ముద్రిత సాహిత్యంలోకూడా అటువంటి ఉద్రేకకారకాలు ఉండరాదని వాదిస్తున్నట్లున్నారు.

    ReplyDelete
    Replies
    1. సుబ్బారెడ్డి గారు ఆత్మహత్యా ప్రయత్నాలు జరుగుతాయని ఒప్పుకుంటూనే ఆ విషయం వ్రాసారు కదా. అందుకే చెప్పాను, అంతే.

      Delete