Saturday, February 25, 2012

ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మెదడులో ఎలాంటి రసాయనిక మార్పులు జరుగుతాయి....!!! ఆత్మహత్యా భావం వారసత్వంగా వస్తుందా....!!!ఆత్మహత్యల గురించి ఆసక్తికర విషయాలు...విశ్లేషణ....!!!


                      నిన్న నా పి.జి పరిక్షలకు సన్నద్దమవటంలో భాగంగా ఫోరెన్సిక్ మెడిసిన్ చదువుతుంటే ఆత్మహత్యల గురించి ఆ పుస్తకంలో ఉంది . ఆత్మహత్యల మీద సమాచారం బ్లాగర్లతో పంచుకుందాం అనే ఉద్దేశంతో అంతర్జాలం నుంచి, నా మెడికల్ పుస్తకాల నుంచి మరింత సమాచారం సేకరించి క్లుప్తంగా ఈ టపా రాస్తున్నాను.








ఆత్మహత్యల గురించి మనకు తెలియని నిజాలు:
  1. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు పది లక్షలమంది ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు.
  2. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఆత్మహత్య చేసుకుని మరణించే  వారి సంఖ్య 13 వ స్థానం లో ఉంది.
  3. ఆత్మహత్య చేసుకునే స్వభావం స్త్రీలలో కంటే పురుషులలో మూడు నించి నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది.
  4. యుక్తవయస్కులు మరియు 35  సంవత్సరాల లోపు వారే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.



                            ఇక ఆత్మహత్యకు దారితీసే కారణాల గురించి చెప్పుకుంటే , ఆత్మహత్య చేసుకోవడానికి మానసిక వత్తిడి ప్రధాన కారణం. మానసిక వత్తిడికి దారితీసే కారణాల్లో జీవిత భాగస్వామితో సమస్యలు మొదటి స్థానంలో ఉండగా వ్యక్తిగత ఆరోగ్యకారణాలు, ఉద్యోగ కారణాలు, ఆర్ధిక ఇబ్బందులు తరువాత స్థానాల్లో ఉన్నాయి. వీటితో  పాటుగా మానసిక వ్యాధిగ్రస్థులు, మద్యానికి బానిస అయిన వాళ్ళుడ్రగ్స్ కి  అలవాటు పడిన వాళ్ళలో కూడా ఆత్మహత్యా స్వభావం ఎక్కువగా ఉంటుంది.

ఆత్మహత్య చేసుకోబోయే ముందు మెదడులో ఎలాంటి జీవ రసాయన చర్యలు జరుగుతాయి:

                    ఈ విషయం మీద పెద్ద పరిశోధనే జరిగింది. చివరకు ఆ పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే ఆత్మహత్యా ప్రయత్నం చేసిన వారి మెదడులో సెర టోనిన్ ( బ్రెయిన్ న్యూరో ట్రాన్స్మిటార్) స్థాయి సాధారణ వ్యక్తుల సెరటోనిన్ స్థాయితో పోలిస్తే తక్కువగా ఉందని. అలాగే ఆత్మహత్య చేసుకుని మరణించిన వారి మెదడులో సెరటోనిన్ స్థాయి ఆత్మహత్యా ప్రయత్నం చేసిన వారి సెరటోనిన్ స్థాయి కంటే ఇంకా తక్కువగా ఉందని కూడా తేలింది. ఈ హెచ్చు తగ్గులన్ని  మెదడులోని ventro medial pre fontal cortex  లో జరుగుతాయి. అయితే ఎటువంటి మానసిక వత్తిడి లేకుండా కేవలం సెరటోనిన్ స్థాయి తగ్గిపోయినా కూడా ఆత్మహత్యా స్వభావం వస్తుందని , ఇది వారసత్వం గా సంక్రమిస్తుందని కూడా శాస్త్రవేత్తలు తేల్చారు. ఆత్మహత్యల గురించి మీడియా లో పదే పదే చూపించడం కూడా సాధారణ వ్యక్తిలో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరణ కలిగిస్తుందని చాలా పరిశోధనలు చెపుతున్నాయి.


ఆత్మహత్యలను ఎలా నివారించవచ్చు ???

            

             









         



                  సమస్యని పరిష్కరించడం ద్వారా, బాధితులకు మనోనిబ్బరం కలిగించడం ద్వారా, మానసిక వ్యాధి నిపుణులను సంప్రదించడం ద్వారా, మనస్తత్వశాస్త్ర నిపుణుడిని సంప్రదించి కౌన్సెలింగ్ తీసుకోవడం ద్వారా ఇలాంటి ఆత్మహత్యా భావాలు రాకుండా నివారించ వచ్చు.

No comments:

Post a Comment