Wednesday, February 08, 2012

సుమ యాంకరింగ్ శృతిమించుతోందా....!!! స్థూలకాయుల మనోభావాలు దెబ్బతింటున్నాయా...!!!

                     
                 తన చలాకీతనంతో, సమయస్ఫూర్తితో, సందర్భోచిత వ్యాఖ్యానంతో, అందరిలో కలిసిపోయి నవ్వులు పూయించే సుమ, యాంకరింగ్ రంగం లోనికి ప్రవేశించే వారికి స్ఫూర్తిగా నిలిచిందనడంలో ఎటువంటి సందేహం లేదు. కేరళ నుంచి వచ్చి కూడా తెలుగు భాష మీద పట్టు సాధించి , స్పష్టంగా మాట్లాడుతూ ఇప్పుడున్న తెంగ్లిష్ మాట్లాడే వారందిరికి ఆదర్శంగా నిలుస్తుంది. ఈ టి.వి లో స్టార్ మహిళ( 1000 ప్లస్) మరియు జీన్స్ ,మా టివి లో భలేచాన్సులే, జీ తెలుగులో భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్, టివి 9 లో పంచావతారం వంటి షోలను అలవోకగా నడిపిస్తున్న సుమ యాంకరింగ్ ఈ మధ్య కొంచెం శృతి మించుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆవిడ వీరాభిమాని అయిన మా ఆవిడ కూడా నాతో ఈ మాట అనడం నన్ను ఈ టపా రాయడానికి ప్రేరేపించింది.
                    అసలు విషయానికి వస్తే గత కొన్ని నెలలుగా ఒక ఛానల్లో ప్రసారం అవుతున్న పాము నిచ్చెన ఆటలో సుమగారు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అందులో జంబో అనే క్యారెక్టర్ పట్ల సుమ గారు, ఆ ఆటలో పాల్గొనడానికి వచ్చిన సెలెబ్రిటిలు వ్యవహరించే తీరు స్థూలకాయులను మనోవేదనకు గురిచేసాలా ఉందని అనిపిస్తుంది. జంబో అని పిలవడం ఒక ఎత్తయితే, చీటికి మాటికి జంబో స్థూలకాయాన్ని ఉద్దేశించి సుమగారు చేసే వ్యాఖ్యలు ఎబ్బెట్టుగా అనిపిస్తున్నాయి. జంబోని కాలితో తన్నడం, నేల మీద పడుకో పెట్టించి సెట్లో ఉన్న వాళ్ళందరితో పైకి లేపించడం, జంబో నీ బరువెంత అని మళ్లీ మళ్లీ అడగటం, జంబోని వంగోమని అడిగి( ఒక ఆటలో భాగంగా) వంగోబోయే లోపు పాంట్ చిరిగినట్టు పర్ మని శబ్దం చేయడం వంటి సంఘటనలు కేవలం మచ్చుకు మాత్రమే. స్థూలకాయమ్ ఉన్నవాళ్ళు కామెడి చేయడం ఇంతకుముందు చాలా చిత్రాలలో ఉన్నప్పటికీ టెలివిజన్ చరిత్రలో ఇదే ప్రధమం అనుకుంటా.
                    ఏ సందర్భాన్నయినా తన మాటల చాతుర్యంతో పండించే సుమ ఇలా జంబో మీద ఎందుకు పడిందో అర్ధం కావడం లేదు. ఏదేమయినా ఆంధ్రుల అభిమాన యాంకర్ గా  పేరొందిన సుమ ఇలాంటి పనులు చేయకుండా ఉంటే మరింత ఆదరాభిమానాలు పొందుతుందని నా అభిప్రాయం.

20 comments:

  1. u r correct......Suma is doing more jokes on jumbo personality....apart from that she give the chances to participents to tease him....
    the only solution is they have to replace the jumbo.

    ReplyDelete
  2. అనామకుడు/అనామిక గారు...జంబోని తీసి వేస్తే పాపం ఆయన జీవనోపాధిని దెబ్బతీసినట్లు అవుతుందేమో కదండీ...దాని బదులు మన సుమ గారు మారితే సరిపోతుంది కదా....ఏమంటారు?

    ReplyDelete
  3. ఆవిడ గారి యాంకరింగు బాగానే ఉన్న ఎదుటవారిని పిచ్చివాళ్ళకింద జమకడుతుంది.

    ReplyDelete
  4. సుమ చేసేవన్నీ ఆ ప్రొగ్రాం డైరెక్టర్ చెప్పినవే కదా??లేక యాంకర్లకు వాళ్ళకు తోచింది స్పాంటేనియస్ గా చేసే చాన్స్ ఉంటుందా??
    ఒక వేళ సుమ స్క్రిప్ట్ ఫాలో అయి అవి చేసుంటే మనం ఆవిడను ఏమి అనలేం.. ఆ డైరెక్టర్ ని తిట్టాలి..

    ReplyDelete
  5. కొన్ని సార్లు యాంకర్లు స్పాంటేనియస్ గా చేస్తుంటారు కార్తీక్ గారూ...ఇలా చేయడం లో సుమ దిట్ట !!! మీరన్నట్లు ఇందులో డైరెక్టర్ తప్పు గూడా ఉండొచ్చు.

    ReplyDelete
  6. ఈ విషయం సుమ ద్రుష్టికి తీసుకు వెళితే ఆవిడ లో మార్పు మనం చూడ వచ్చేమో ?

    ReplyDelete
  7. నిజమే సుమ గారూ...కాని మనకి వాళ్ళని రీచ్ అవ్వాలంటే చాలా కష్టమయిన పని కదా...అన్నట్లు మీరు ఆ సుమ గారు కాదు కదా సుమీ....!!!

    ReplyDelete
  8. నేను ఆ సుమ ను కాను కాని ఆవిడ ఆభిమానులలో ఒకరిని. నిజమే కొంచెం కష్టమే కాని నేను ప్రయత్నిస్తాను.

    ReplyDelete
  9. మీరు ఆ ప్రయత్నం లో ఉండండి సుమ గారూ...ధన్యవాదములు

    ReplyDelete
  10. నిజమే. పైన రాసిన సుమగారు, ధన్యవాదాలు!

    ReplyDelete
  11. కావాలని చేయకపోయినా ఇలాంటివి జరిగినపుడు సద్విమర్శ చేస్తే ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడేందుకు అవకాశం వుంటుంది. ప్రస్తుతం సుమ,సుమ కాకుంటే ప్రోగ్రాం ను క్రియేట్ చేసే సందర్భం లో ఈ తప్పు దొరలడానికి కారకులు సరిచేసుకోవలసింది ఇదే . కాకపోతే మంచి జరిగినా, చెడు జరిగినా ముందు యాక్టర్లకే ఆ పేరు ఎక్కువ వస్తుంది.కేరళ నుండి వచ్చి తెలుగు అమ్మాయిగా మారిన సుమ ఇలాంటి లోపాల్ని తప్పనిసరిగా సవరిచుకుంటుందనే ఆశిద్దాం. డా.వెంకట సుబ్బారెడ్డి ఆవుల గారు మంచి పోస్టు వ్రాశారు. అభినందనలు.

    ReplyDelete
  12. మన తెలుగోళ్ళ దరిద్రం కాకపోతే, వయసు మీద పడ్డ ఆ ముగ్గురు తప్ప తెలుగు సరిగ్గా మాట్లాడే అమ్మాయిలే కరువయ్యారా?

    ReplyDelete
  13. మన తెలుగోళ్ళ దరిద్రం కాకపోతే, వయసు మీద పడ్డ ఆ ముగ్గురు తప్ప తెలుగు సరిగ్గా మాట్లాడే అమ్మాయిలే కరువయ్యారా?

    ReplyDelete
  14. నాకూ సుమ యాంకరింగ్ నచ్చుతుంది . జంబో మీద జోక్స్ తప్ప . పంచావతారం కూడా ఈ మధ్య బోర్ కొడుతుంది ఇక ఆ ప్రోగ్రాం ఆపెయ్యమని కూడా సుమకి నా మాటగా చెప్పండి సుమగారు

    ReplyDelete
  15. Kondalarao garu, bonagiri garu, lalitha gaaru, thanks all

    ReplyDelete
  16. your view is wrong,
    she calls him as brother in the episode opening itself
    if as u think she is teasing obesity persons why will she call him with a relation
    and the comments are just to create fun and nothing to see in wide lense

    ReplyDelete
  17. SUMA GARU MEERU MANCHI ANCHOR ANDI MEE GURINCHI INTHA DISCUSSION JARAGATHAVUNDHANTE MEE MEEDHA MAKUNA GAURAVAM ANDI PLEASE TAKIT EASY

    ReplyDelete
  18. SUMA GARU MEE GURUNCHI INTHA DISCUSSION JARUGUTHUNDHANTE JAKE CHALA SANTOSHAMGA VUNDHI ENDHUANTE VEELANTHA SUMA GARI ABIMANULU KABADI SO SUMA GARU MEE ABIMANULA BADHANU ARTHAM CHESUKOGALARANI ASISTHUNANU THANK U






    ReplyDelete
  19. suma gaari programmes chala mandi enjoy chesthuntaru same way comments kuda common.okariki navvocchina matter inkokariki tappuga kanpinchadam common a kadha....

    ReplyDelete
  20. suma anchoring chala mandi enjoy cheshuntaru.......at d same way nacchani vaallu vuntaru kabatti comments common....overall ga 80% suma gari anchoring ni istapadataru.....ayina ee rojulloe okarini nacchindi inkokokariki nacchadu,ayina suma gariki following ekkuve...truly suma gaarila evarunnaru anchoring chesevallu ee rojulloe....good anchoring,gd dress scence

    ReplyDelete