ఈ మధ్య కాలంలో నేను ఒక విచిత్రమయిన పరిస్థితిని చూస్తున్నాను . అదేమిటంటే నా దగ్గరకు వచ్చే చాలా మంది పేషెంట్స్ హాంగ్ఓవర్ అని కంప్లైంట్ చేస్తున్నారు. కారణం ఏమిటా అని ఆరా తీస్తే ACB దాడులకు భయపడి మద్యం సిండికేట్లు మద్యాన్ని MRP ధరకే అమ్ముతున్నారని తెలిసింది. ఇంకేముంది... అప్పటివరకు 120/130 రూపాయలకు కొన్న క్వార్టర్ బాటిల్ కేవలం 80 రూపాయలకే లభిస్తుండే సరికి మందుబాబుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. రోజూ రెండు క్వార్టర్లు పీకే వారు అదే డబ్బులతో మూడు క్వార్టర్లు పీకటం మొదలెట్టారు. అలా హాంగ్ఓవర్ బారిన పడేవాళ్ళు ఎక్కువయ్యారు.( నా బిజినెస్ కూడా బాగా పెరిగింది లెండి...!!!) . అందుకే హాంగ్ ఓవర్ గురించి బ్లాగర్లకు చెబుదామనిపించి ఈ టపా రాస్తున్నాను.
హాంగ్ ఓవర్ ఎలా వస్తుంది...? లక్షణాలు ఎలా ఉంటాయి?
( Congeners ) అంటారు
హాంగ్ఓవర్ ని ఎలా తగ్గించు కోవచ్చు...?
పురాతన కాలంలో హాంగ్ఓవర్ ని తగ్గించడానికి మిర్ అనే ఒక రసాయనం మరియు పక్షుల యొక్క ముక్కు ని మెత్తని మిశ్రమంగా కలిపి ఇచ్చేవారు. కానీ ప్రస్తుత కాలంలో అలాంటి మిశ్రమాన్ని వాడటం మంచిది కాదని నిపుణులు తేల్చేసారు. హాంగ్ఓవర్ కి చికిత్స లేదు కాబట్టి నివారణ ఒక్కటే మార్గం అని నిపుణులు సూచిస్తున్నారు. అధిక శాతం ఆల్కహాల్ కలిగి వున్న విస్కీ మరియు బ్రాందీలను సేవించడం మాని తక్కువ మోతాదులో ఆల్కహాల్ వుండే వోడ్కా మరియు జిన్ వంటివి సేవించడం ద్వారా ఈ హాంగ్ఓవర్ బారినుండి బయట పడవచ్చు. రసాయన పదార్ధాలు కలిపిన అన్ని రకాల మద్య పానీయాలకు దూరంగా ఉంటే మంచిది. సాధారణంగా రెడ్ వైన్ అధికంగా సేవించడం ద్వారా వచ్చే హాంగ్ఓవర్ చాలా దారుణంగా ఉంటుంది. ఇలా అధిక మొత్తంలో మద్యం సేవించి హాంగ్ఓవర్ వచ్చిన వాళ్ళు తరువాత రోజు అధిక కోపంతోను, నీరసించి పోయి వుంటారు.
కాబట్టి మద్యాన్ని మనం ఎంజాయ్ చేయాలి కానీ మద్యం మనల్ని ఎంజాయ్ చేయకుండా చూసుకోవడం మంచిది. అంతే కదండీ....!!!!
మీరు జునియర్ వైద్యుల మీద వ్రాసిన టపా లు ఎందుకు థొలగించారు
ReplyDeleteanonymous garu...mee personal mail id ivvandi, meku mail chesthanu.
ReplyDelete