Friday, December 30, 2011

తుఫాన్ లకు పేర్లు ఎలా పెడతారు...!!!

             నీరు ప్రశాంతంగానే కనిపిస్తుంది, కానీ అప్పుడప్పుడు జలహృదయం లో ప్రకంపనలు వస్తుంటాయి. నీటికి కోపం వస్తుంది. ఆ కోపమే జలప్రళయం అవుతుంది. ఆ కోపంలో భాగంగానే అప్పుడప్పుడు తుఫాన్లు వస్తుంటాయి. తుఫాన్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తీరప్రాంతాలను అల్లకల్లోలం చేస్తాయి. ప్రస్తుతం మనం చూస్తున్న థేన్ తుఫాన్ కూడా అలాంటిదే. అయితే ఈ తుఫాన్లకు పేర్లు ఎవరు పెడతారు అనే అనుమానం వచ్చి అంతర్జాలంలో వెతకగా చాలా కొత్త విషయాలు తెలిసాయి.
            ఇలా ప్రపంచవ్యాప్తంగా వచ్చే తుఫాన్లను మహాసముద్రాల వారీగా గుర్తించారు. ప్రస్తుతం మనం ఉంటున్నది నార్త్ ఇండియన్ ఓసియన్ జోన్. ఈ జోన్ లో మన దేశంతో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక , థాయిలాండ్ , మయన్మార్, ఒమన్, మాల్దీవులు ఉన్నాయి. ఈ దేశాల్లోని  వాతావరణ శాఖ నిపుణులు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి భేటీ అయి తుఫాన్లకు కొన్ని పేర్లను సూచిస్తారు. అలా ప్రతి దేశం తమ వంతుగా ఎనిమిది పేర్లను సూచిస్తుంది. నార్త్ ఇండియన్ ఓసియన్ జోన్ లో మొత్తం ఎనిమిది దేశాలు ఉన్నాయి కాబట్టి, మొత్తం 64 పేర్లను ముందే నిర్ణయించారు. ఇప్పటికి 27 తుఫాన్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం 28 వ తుఫాన్ ను మనం చూస్తున్నాం.
             నార్త్ ఇండియన్ ఓసియన్ జోన్ కి సూచించిన పేర్లలో  మన దేశం వారు అగ్ని, ఆకాష్బిజ్లి , జల్, లేహేర్, మేఘ, సాగర్, వాయు అనే పేర్లు సూచించారు. ప్రస్తుతం మన తూర్పు తీరాన్ని అల్ల కల్లోలం చేస్తున్న "థేన్ " తుఫాన్ పేరు మయన్మార్ దేశస్తులు సూచించారు. శ్రీలంక మరియు బంగ్లాదేశ్ వారు సూచించిన పేర్లలో మాల, రష్మి, నిషా, గిరి , అనే పేర్లు మన వాడుక భాషకు చాలా దగ్గరగా ఉన్నాయి. ఇక పక్కనే ఉన్న పాకిస్తాన్ విషయానికి వస్తే నర్గిస్, లైలా, బుల్బుల్ , నీలం, నిలోఫర్  అని మన దేశ హీరోయిన్ల పేర్లు జల ప్రళయాలకు పెట్టి ఆనందిస్తున్నారు( ఎంతయినా మన శత్రువులు కదండీ...!!!) ఇదండీ తుఫాన్ల పేర్ల వెనుక ఉన్న కథా కమామీషు. రాబోయే ముర్జన్, నీలం ( అదేనండి... పేర్లు ముందే పెట్టేసారు కదా, వరుసక్రమం లో ఈ పేర్లు తరువాత వచ్చే తుఫాన్లకు పెడతారు) తుఫాన్లు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా వాటి దారిన అవి తీరం దాటతాయని  ఆశిద్దాం....!!!

4 comments:

  1. ఓహో.. ఇంత process ఉందా? ఇప్పటివరకూ తెలియదండీ. Thank you.

    ReplyDelete
  2. హ హ హ !! నెక్స్ట్ రాబోయేది "సుబ్బు" తుఫాన్ ఏమో!!???

    ReplyDelete
  3. నాకు కూడా ఇదే అనుమానము వచ్చింది ఈ పేరు ఎలా పెట్టారు అని మంచి విషయం చెప్పారు ధన్యవాదములు

    ReplyDelete