Monday, December 26, 2011

అంతర్జాతీయ మానవతా సహాయ శిక్షణ సదస్సు విశేషాలు

               ఈ నెల 12 వ తారీఖు నుంచి 16 వ తారీఖు వరకు ఢిల్లీ లో  అంతర్జాతీయ మానవతా సహాయ శిక్షణ సంస్థ వారు శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. ఈ సంస్థ వారు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఒక దేశం లో శిక్షణా శిబిరాలను నిర్వహిస్తుంటారు. నేను పని చేస్తున్న M S F సంస్థ వారు నాకు ఆ శిక్షణా శిబిరములో పాల్గొనే అవకాసం కలిపించారు. ఆ సందర్భం గా జరిగిన విషయాలను ఈ టపా లో మీతో పంచుకుంటునందుకు నాకు చాల గర్వం గా ఉంది.
              ఇక విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తం గా  ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చాలా సోదాహరణంగా శిక్షకులు వివరించారు. అంతర్యుధం, పేదరికం, ప్రభుత్వం చే నిర్లక్ష్యం చేయబడిన, ప్రకృతి విపత్తులలో సర్వస్వం కోల్పోయిన ప్రజలు ఎదుర్కొనే కష్టాలు చూసి నా మనసు చలించి పోయింది. ప్రస్తుతం నేను పని చేసే ఆంధ్ర, ఒరిస్సా ఛత్తీస్ ఘడ్ ప్రాంత గిరిజనులకు వైద్య సదుపాయం అందించే ప్రక్రియ కొంచెం కష్టము తో కూడుకున్నది . ఈ శిక్షణ తరువాత ఈ ప్రాంత గిరిజనులకు ఇంకా మెరుగ్గా వైద్య సేవలు అందించ గలననే నమ్మకం కలిగినది.
                ఇంకా ఈ సదస్సు లో ప్రపంచ వ్యాప్తం గా పనిచేసే స్వశ్చంద సంస్థల గురించి కూడా తెలుసుకున్నాను. అత్యవసర పరిస్థుతుల బారిన పడిన ప్రజలకు , అలాగే శరణార్దులకి వసతి, ఆహరం , వైద్య సేవలు, విద్య, వంటివి ఎలా సమకుర్చాలో ఈ సదస్సు ద్వారా చాలా చక్కగా తెలుసుకున్నాను. అలాగే ఏదయినా ఒక ప్రకృతి విపత్తు సంభవించినపుడు చాలా సంస్థలు అక్కడ సహాయం అందించడానికి వస్తాయి. ఇటువంటి పరిస్థితులలో అన్ని సంస్థలతో పరస్పరం సమాచారం ఇచ్చి చేసే పనిని ఎంత బాగా చేయవచ్చో చక్కగా వివరించారు. 
               ఎముకలు కొరికే చలిలో  (  2 .6  డిగ్రీల చలి ) శిక్షకులు చెప్పిన తాజా తాజా విషయాలతో వారం రోజులు తెలియకుండా అయిపోయాయి. కానీ చివరకు ఎంతో నేర్చుకున్నాం. అలాగే అవసరములో ఉన్న ప్రజలకు ఇంకా ఎంతో చేయాల్సి ఉందన్న విషయం కూడా తెలుసుకుని నుతనోత్తేజం తో తిరుగు విమానం ఎక్కడం తో నా ఢిల్లీ యాత్ర ముగిసింది.

2 comments:

  1. డాక్టర్ గారూ, చాలా బాగా చెప్పారండి!
    మీ అంతర్జాతీయ మానవతా సహాయ శిక్షణ సదస్సు విశేషాలు మాతో share చేసుకున్నందుకు మీకు ధన్యవాదములు!
    వైద్యం బిజినెస్ గా మారిన, ఈ రోజుల్లో.. చదివిన చదువుకి సార్థకత నిస్తూ, గిరిజన ప్రజలకు వైద్య సహాయం అందిస్తున్న మీ సామాజిక స్ప్ర్హుహ కి, రియల్లీ , రియల్లీ hats off అండి!!!
    All the best!!

    ReplyDelete
  2. reddy garu......... i am really proud of you... i feel ashamed for not doing that... keep it up. our country needs people like you

    ReplyDelete