Friday, March 30, 2012

మనకు తెలియని ఆసక్తికర నిజాలు...!!! ఆరవ భాగం


  1. చిలుక తన ముక్కుతో  350 పౌండ్స్/ చ.అ  ల బలం ఉపయోగించి కొరకగలదు...!!!
  2. గుడ్ల గూబ చూపుడు శక్తి మానవుడి చూపుడు శక్తి కంటే 82 రెట్లు ఎక్కువ ఉంటుంది.
  3. ఒక పౌండ్ యురేనియం లో ఉన్న అణువులు విచ్చిన్నం చెందితే విడుదలయ్యే శక్తి  మూడు మిలియన్ పౌండ్ ల బొగ్గు ని తగలబెడితే వచ్చే శక్తికి సమానంగా ఉంటుంది.
  4. మన శరీరంలో ప్రతి క్షణం 15 మిలియన్ల రక్త కణాలు తయారవుతాయి మరియు నాశనం అవుతాయి....!!!
  5. మనం పళ్ళు తోముకునే పేస్టు లో సుద్ద( Chalk ) కలుపబడి ఉంటుంది. ఈ సుద్ద వలన పేస్టు కి క్షార గుణం వుంటుంది. మన పళ్ళ మీద పేరుకు పోయిన షుగర్ ఉత్పత్తి చేసే ఆమ్లాన్ని పేస్టు లో ఉండే ఈ క్షారం తటస్థం చేసి మన పళ్ళను కాపాడుతుంది.
  6. శక్తి ని కొలిచే పదం వాట్ ని స్టీమ్ ఇంజన్ కనిపెట్టిన జేమ్స్ వాట్ గౌరవార్ధం పెట్టారు.
  7. మానవుడు తన జీవిత కాలంలో సగటున లక్ష లీటర్ల నీటిని తాగుతాడు .

Source :IGNOU / GV

No comments:

Post a Comment