Friday, March 09, 2012

పుజారులమీద కేసు పెడతా, ఎన్.టి.ఆర్ మీద ఫిర్యాదు చేస్తా...!!! పూజారుల మీద చేసిన వ్యాఖ్యల వివాదంలోకి జూనియర్ ఎన్.టి.ఆర్ ని లాగే ప్రయత్నం చేసిన రాంగోపాల్ వర్మ గారు...!!!సినీ పరిశ్రమలో మరో వివాదానికి తెర లేయనుందా...!!!

                            పూజారులు మంత్రాలు సరిగా చదవకపోవడం వల్లనే పెళ్ళిళ్ళు పెటాకులవుతున్నాయని ట్వీటిన ( ట్విట్టర్ర్ లో రాసుకున్నారు) వర్మగారు ఇప్పుడు ఈ విషయం పెద్ద రచ్చకు దారి తీసే సరికి పూజారుల మీద ఎదురు దాడికి దిగారు. దీనికి సంభందించి నిన్న ట్విట్టర్ర్ లో మరి కొన్ని కామెంట్లు పెట్టారు. అయితే ఈ వివాదం లోకి జూనియర్ ఎన్.టి.ఆర్ ని లాగే ప్రయత్నం చేసారు వర్మ గారు. ఆయన నిన్న ట్విట్టర్ర్ లో ఏం రాసారో మీరు ఒక సారి చదవండి.
  • కొందరో, అందరో, అనుకుంటున్నట్టుగా నేను బ్రాహ్మణులకి వ్యతిరేకిని కాదు కానీ, పూజారులకి వ్యతిరేకిని. కానీ దేవుడిని ప్రేమిస్తాను. 
  • అందరి దేవుళ్ళని ప్రేమించను, కేవలం కొంతమంది సెలెక్టేడ్ దేవుళ్ళని మాత్రమే ప్రేమిస్తాను
ఇంతవరకు బాగానే ఉంది.... అసలు కథ అంతా ఇక్కడే మొదలవుతుంది. తరవాత ఏమన్నారో చదవండి.
  • నా పూజారుల మీద కామెంట్ల కంటే ఎన్.టి.ఆర్ అదుర్స్ లో చేసింది ఎక్కువ , కానీ తను స్టార్ కనక నేను ఫ్లోప్ డిరెక్టర్ కనక పూజార్లు నన్ను టార్గెట్ చేస్తున్నారు. 
  • ఈ విషయం మీద నేను జూ. ఎన్.టి.ఆర్ మీద , పూజారుల మీద ఎండోమెంట్ మినిస్ట్రీ లో కంప్లైంట్ ఇస్తా...!!! 
  • పూజారుల మీద జూ. ఎన్.టి.ఆర్ కి నాకు మధ్యన సెలెక్టివ్ డిస్క్రిమినేషన్ నేరం కింద కేసు పెడతా... 
  • నేను ట్వీట్ లో రాసినదానికి, జూ. ఎన్.టి.ఆర్ అదుర్స్ లో చేసినదానికి కంపేర్ చేస్తే ఏ మూర్ఖుడికైనా నేను చెప్పింది అర్ధమవుతుంది.
                    ఇదండీ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు చేసిన వ్యాఖ్యలు. మొత్తం మీద జూనియర్ ఎన్.టి.ఆర్ తన సినిమా లో బ్రాహ్మణులను వెటకారం చేస్తే లేదు గానీ, నేను "వెబ్" కారం చేస్తే వచ్చిందా అని మానిపోయిన అదుర్స్ గొడవని మళ్లీ లేపే ప్రయత్నం చేసారు వర్మగారు. వాస్తవానికి అదుర్స్ సినిమా విడుదలయినపుడు బ్రాహ్మణులు అభ్యంతరం తెలియ చేసారు. వర్మ గారికి ఈ విషయం గుర్తులేదా, లేక కావాలనే ఇలా ఎన్.టి.ఆర్ ని మరోసారి ఇరికించే ప్రయత్నమా అని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏదేమయినా తాజా వ్యాఖ్యలతో, పూజారులు, జూనియర్ ఎన్.టి.ఆర్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

4 comments:

  1. ఇటువంటి వ్యాఖ్యలకు విలువ ఇస్తున్నంత కాలం వాళ్లు అలా మాట్లాడుతూనే ఉంటారు. ఇటువంటి వాటిని పట్టించుకోవడం అనవసరం. కాగా వర్మ పూజారులతో తనకు ఎదురైన అనుభవాన్ని బట్టి ఆటువంటి వ్యాఖ్యలు చేసిఉండవచ్చు. ఇది బ్రాహ్మణులందరినీ ఉద్దేశించి కాదేమో? ఎందుకంటే బ్రాహ్మణేతర పూజారులు కూడా వున్నారు కదా.

    ReplyDelete
  2. /పూజారులు మంత్రాలు సరిగా చదవకపోవడం వల్లనే పెళ్ళిళ్ళు పెటాకులవుతున్నాయని ట్వీటిన ( ట్విట్టర్ర్ లో రాసుకున్నారు) వర్మగారు/
    హ్వా..హ్వా..హ్వా ఈయన డైరెక్టరే కాదు ఓ మోస్తరు జోకర్ కూడా. మరి వెస్ట్రన్ కంట్రీస్లో పెటాకులు ఎందుకంత ఎక్కువున్నాయి? ఈ మేతావే కూయాలి (ట్వీట్).

    ReplyDelete
  3. / నేను ఫ్లోప్ డిరెక్టర్ /
    సరిగా డైరక్షన్ చేసివుంటే ప్లాపు డైరెక్టర్ అయ్యేవారు కారేమో.
    Snkr

    ReplyDelete
  4. ఈ లెక్కన పేట రౌడీలు, వీధి రౌడీలు కూడా వర్మ పై కేసు పెట్టాలి, ఎందుకంటే వర్మ ఎన్నో సినిమాల్లో వారిని అవమానించాడు. వారి కారక్టర్ ని కించపరిచాడు.

    ReplyDelete