Sunday, March 31, 2013

జలాంతర్గత కేబుల్స్ తెగిపోయాయా లేక రెండు సైబర్ దిగ్గజాల మధ్య యుద్ధమా ...??? ఇంటర్నెట్ వేగం తగ్గడానికి కారణం ఏమిటి...???

                  గత నాలుగైదు రోజులుగా మీ ఇంట్లో లేక మీ మొబైల్ లో ఇంటర్నెట్ మరీ స్లోగా  ఉందా...???   ఫేస్ బుక్ లాంటి కొన్ని వెబ్ సైట్స్ తెరుచుకోవడానికి మరీ ఎక్కువ సమయం పడుతుందా ...??? హారం , కూడలి కూడా సమయం తీసుకుంటున్నాయా ...??? డౌన్ లోడ్ వేగం బాగా తగ్గి పోయిందా ...??? అయితే మీ మదిలో మెదులుతున్న ప్రశ్నలకు సమాధానం ఇదే కావచ్చు. 




                అసలు విషయానికి వస్తే ఈజిప్టు సముద్ర జలాలలో గల సముద్ర గర్భ కేబుల్స్ కొన్ని రోజుల క్రిందట తెగి పోయాయట . దీని వలన భారత దేశం తో పాటు మిడిల్ ఈస్ట్ , దక్షిణాఫ్రికా వంటి దేశాల ఇంటర్నెట్ సేవల మీద బాగా ప్రభావం పడింది. ఈ తెగి పోయిన కేబుల్స్ లో South East Asia -Middle East -Western Europe 4 (SMW 4), India -Middle East -Western Europe (I -ME -WE ) మరియు Europe India  gateway (EIG )కి సంబంధించిన కేబుల్స్ ఉన్నాయి. ఈ సమస్యను చక్కదిద్దడానికి ఆ ప్రాంతంలో జలాంతర్గత కేబుల్స్ ని పర్యవేక్షించే ఇంటర్నేషనల్ కన్సార్టియం అఫ్ ఆపరేషన్స్ ప్రయత్నం చేస్తుంది . 

                 అయితే జరుగుతున్న పరిణామాలకు వేరే కారణాలు ఉన్నాయని కొంతమంది అంటున్నారు . ఈ పరిస్థితి కి గల కారణాన్ని రెండు సైబర్ దిగ్గజాల మధ్య జరుగుతున్న పోరు గా అభివర్ణిస్తున్నారు . ఏది ఏమయినా ఈ పరిస్థితి వలన భారత దేశం లోని అధిక భాగం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . 

                ఇక టెలికం సంస్థల విషయానికి వస్తే BSNL మరియు Airtel వంటి సంస్థల మీద ఈ ప్రభావం బాగా పడిందని ఎకనామిక్ టుడే పత్రిక పేర్కొంది . అయితే ఎయిర్టెల్ తన డేటా ట్రాఫిక్ ని మరో మార్గం గుండా తరలిద్దామని నిర్ణయించుకుంది. Vodafone , MTNL  వంటి సంస్థల మీద కూడా ఈ ప్రభావం పడింది . ప్రస్తుతం సెలవులు కావడం వలన డేటా వాడకం అంతగా లేదని , సోమ వారానికి ఈ సమస్య మరింత తీవ్రం కావచ్చని , ఈ సమస్య పరిష్కారం కావడానికి మరొక 3 నుంచి 4 వారాల సమయం పట్ట వచ్చని Indian ISP Association President రాజేష్ చారియా గారు చెప్పారు . 

మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే  మీ అనుభవాలను కామెంట్ల రూపంలో పంచుకోండి ... !!!




1 comment:

  1. అదా సంగతీ...చాలా ఇబ్బందిగా ఉందండీ...అసలే అంతంత మాత్రం బీఎసీ ఎన్ ఎల్ ..ఇప్పుడు ప్రాబ్లం మరింత ఎక్కువైంది...

    ReplyDelete